News July 31, 2024
మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో రూ. వెయ్యి కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. సీఐ నరేశ్ ప్రకారం.. మోఘ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండా ఈనెల 20న రుణమాఫీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయిలు.. లక్ష్మణ్ వద్ద రూ. వెయ్యి లాక్కున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో సలాబత్ పూర్ బ్రిడ్జి వద్ద లక్ష్మణ్‌ను.. సాయిలు బండరాయితో మోది హత్య చేశాడు.
Similar News
News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News February 11, 2025
జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
నవీపేట్: చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య

నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో తల్లదండ్రులు మళ్లీ ఒప్పించి కాలేజీలో జాయిన్ చేశారు. తన తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్థాపం చెంది గత నెల 27వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిచగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.