News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News January 23, 2026
ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షకు 17,122 మంది హాజరు

ఏలూరు జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ పరీక్షకు మొత్తం 17,122 మంది హాజరు కాగా 451 మంది గైర్హాజరు అయ్యారని RIO యోహాన్ తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ విద్యార్థులు 15,250 మందికి 14,893 హాజరు కాగా 357 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,323 మందికి 2,229, హాజరుకాగా 94 మంది గైర్హాజరు అయ్యారని దీంతో 97 శాతం పరీక్ష హాజరు నమోదైందన్నారు.
News January 23, 2026
సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.
News January 23, 2026
పూర్తిగా సహకరించా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.


