News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News January 24, 2026
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News January 24, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే!

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపాలిటీల వారిగా సమన్వయ కర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. సిరిసిల్లకు తుల ఉమా, వేములవాడకు గూడూరి ప్రవీణ్, కరీంనగర్‌కు వినోద్ కుమార్, జగిత్యాలకు విద్యాసాగర్, పెద్దపల్లికి లోక బాపురెడ్డి, కోరుట్లకు నరేంద్రనాథ్, ధర్మపురికి రఘువీర్ సింగ్, చొప్పదండికి శ్రీనివాస్ యాదవ్, మెట్‌పల్లికి శ్రీకాంత్ రెడ్డి, రామగుండంకు ఈశ్వర్ లను నియమించారు.
News January 24, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితుల బంధువులకు వారసులకు (పీవోఏ) యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించినట్లు కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.


