News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

Similar News

News January 18, 2026

విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఎస్‌ఈ రాజేశ్వరి

image

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు APEPDCL ఎస్‌ఈ రాజేశ్వరి ఆదివారం తెలిపారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 18, 2026

వనపర్తి: పుర ఎన్నికల ఆశావహుల్లో నైరాశ్యం

image

పుర ఎన్నికల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల ఆశలు అడియాసలయ్యాయి. గత రిజర్వేషన్లు తారుమారు కావడంతో పతులు తమ సతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు తమ సతీమణులను పోటీకి దించేందుకు సిద్ధపడగా, మరికొందరు అనుచరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.