News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News January 13, 2026
‘మీ సేవ’ ముసుగులో భూ రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహా!

TG: భూ భారతిలో వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహాపై విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మీసేవ’లో భూ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకున్నా కొందరు నిర్వాహకులు ప్రజలను మభ్యపెట్టి తతంగాన్ని నడిపించారు. భూ భారతి (గతంలో ధరణి) సైట్లో నేరుగా దరఖాస్తులు అప్లోడ్ చేసి అక్రమాలకు తెగబడ్డారు. ‘మీసేవ’ ప్రభుత్వానిదేనన్న ఉద్దేశంతో ప్రజలూ నమ్మారు. దీంతో నిర్వాహకులు సొమ్ము కాజేసినట్లు అనుమానిస్తున్నారు.
News January 13, 2026
ప్రజలంతా రోడ్డు భద్రత నియమాలను పాటించాలి: ఎస్పీ

ప్రజలంతా రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్ అన్నారు. మహబూబాబాద్ రూరల్ మండలం ఈదుల పూసపల్లిలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ లేకుండా వాహనదారులు ప్రయాణం చేయవద్దని సూచించారు. సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక పాల్గొన్నారు.
News January 13, 2026
రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఓల్డ్ లుక్‌తో రూఫ్ టాప్ ఫైట్ యాడ్ చేసిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


