News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

Similar News

News January 16, 2026

లీకేజీ సుడిగుండంలో HYD అగ్రీ వర్సిటీ..!

image

రాష్ట్రంలో ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరున్న రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ సుడిగుండంలో చుట్టుకుంది. లీకేజీ కేసులో నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయగా, 35 మంది అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు. 2014, 2024 మధ్య పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు జరిగినట్లు వైస్ ఛాన్స్‌లర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.

News January 16, 2026

225 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ESI<<>> కార్పొరేషన్ 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 16, 2026

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.