News April 1, 2024
మద్యం మత్తులో కొడుకుని హత్య చేసిన తండ్రి

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధి క్రిస్టియన్ పేటకు చెందిన తవనం మోజెస్(29) తండ్రి కవిరాజు చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తండ్రీ కుమారుడు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ సమయంలో తండ్రి కోపంతో అందుబాటులో ఉన్న మంచం కోడుతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మోజేస్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మోజేస్‌కు వివాహం కాలేదు. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 7, 2026
గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.
News February 6, 2026
PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News February 6, 2026
ఉద్దండరాయునిపాలెం: రేపు క్వాంటం వ్యాలీకి సీఎం భూమిపూజ

రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో శనివారం క్వాంటం వ్యాలీ నిర్మాణానికి CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమ ప్రదేశాన్ని పర్యవేక్షించి, బందోబస్తుపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


