News March 6, 2025

మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానా: పార్వతీపురం SP

image

మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. గడిచిన రెండు రోజుల్లో 14 మందిపై కేసులు నమోదు చేసి రూ. 1.40 లక్షల ఫైన్ విధించినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Similar News

News December 15, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 15, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 48 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI)లో అసోసియేట్ మెంబర్ అయి ఉండటంతో పాటు ఏడాది పాటు పని అనుభవం గల వారు DEC 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.powergrid.in

News December 15, 2025

అమలాపురం: పొట్టి శ్రీరాములుకి ఘన నివాళి

image

తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నిశాంతి జిల్లా అధికారులు పాల్గొన్నారు.