News August 19, 2025

మధిర: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

image

మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పెసరవల్లి వినోద్(28) వైరా నది చెక్‌డ్యామ్ వద్ద చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వినోద్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 19, 2026

బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

image

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్‌కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

News January 19, 2026

బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్!

image

భద్రతా కారణాలతో T20 WC మ్యాచుల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ <<18885677>>కోరుతుండటం<<>> తెలిసిందే. ఈ క్రమంలో మార్పు సాధ్యం కాదని BCBకి ICC చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 21 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ర్యాంకింగ్ ప్రకారం స్కాట్లాండ్‌ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికగా WC ప్రారంభం కానుంది.

News January 19, 2026

ఈ కలెక్టర్ ఎందరికో స్ఫూర్తి!

image

జిల్లాలోని పేదలందరికీ పథకాలు అందే వరకు జీతం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారో కలెక్టర్. ‘ఫ్రీ రేషన్, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పలన్హర్ యోజన, పేదలు, వితంతువులకు పెన్షన్ పథకాలకు లబ్ధిదారులందరినీ నమోదు చేయాలని అధికారులను ఆదేశించా. లేదంటే జీతం తీసుకోనని చెప్పా. వారిని మోటివేట్ చేసేందుకే ఇలా చేశా’ అని రాజ్‌సమంద్(RJ) కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. పేదలకు పథకాలు ఆలస్యమవడమంటే అన్యాయం చేయడమేనని చెప్పారు.