News November 16, 2025
మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్‌గా డబ్ల్యూవిఎస్‌ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.
Similar News
News January 17, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి
News January 17, 2026
పాలమూరు: మందుబాబులు తగ్గేదేలే..!

సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల్లో ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా రూ.64.9 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జనవరి 12న రూ.9.56 కోట్లు, 13న రూ.8.66 కోట్లు, 14న రూ.9.87 కోట్లు, 16న రూ.11.81 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 227 మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు.
News January 17, 2026
సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.


