News October 5, 2025
మరికల్: ఎంపీటీసీ ఎన్నికలకు 71 గుర్తుల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ 6 జాతీయ పార్టీలతో పాటు, ఏడు ప్రాంతీయ పార్టీలకు పార్టీ గుర్తులను కేటాయించింది. 71 గుర్తింపు పొందిన పార్టీలకు ఫ్రీ సింబల్స్‌తో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగి కోసం 71 గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి బ్యాలెట్‌లో నోటా ఉండనున్నట్లు తెలిపారు.
Similar News
News January 20, 2026
భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు చేరాలి: డిప్యూటీ సీఎం

కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పట్టణ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరులో జాప్యం జరగకూడదని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరాలన్నారు.
News January 20, 2026
దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.


