News November 5, 2025

మరిపెడలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

మరిపెడలో సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. మరిపెడలో ఈ నెల 6 నుంచి 8 వరకు 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వస్తున్నట్లు ప్రిన్సిపల్ దయాకర్ తెలిపారు. 9 రకాల ఆటలు నిర్వహించే ఈ పోటీల్లో ఖమ్మం జోన్‌కు చెందిన 11 పాఠశాల నుంచి 935 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 6న జరిగే ప్రారంభ వేడుకల్లో అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

సంగారెడ్డి: ఇంటర్ హాల్ టికెట్లు సరి చూసుకోండి

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ హాల్ టికెట్లు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సూచించారు. http://tgbie.cgg.gov.inలో హాల్ టికెట్ చూసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీలోపు సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.

News January 23, 2026

సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.

News January 23, 2026

రాయచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డల మృతి

image

అన్నమయ్య జిల్లా రాయిచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డలు మృతి చెందిన విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయచోటిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకున్న ఘటన వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దమండెం మండలం చింతమానివారిపల్లికి చెందిన తవలం వెంకటరమణ భార్య ఈశ్వరమ్మ ప్రసవ నొప్పులతో రాయచోటిలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగిందన్నారు.