News January 10, 2026
మరో స్కామ్: మహిళలను గర్భవతులను చేయాలంటూ..

బిహార్ సైబర్ పోలీసులు ‘ఆల్ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ అనే సైబర్ స్కామ్‌ని ఛేదించారు. ప్లేబాయ్ సర్వీస్, SBI చీప్ లోన్స్ అంటూ SM పోస్టులతో ప్రజలను మోసగిస్తున్నారు. పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని, విఫలమైనా సగం డబ్బులిస్తామని నమ్మిస్తున్నారు. మోడల్స్ ఫొటోలు పంపి ఫ్రీసెక్స్ ఆఫర్ చేసి.. రిజిస్ట్రేషన్, హోటల్ ఛార్జెస్ అని దోచుకుంటారు. రంజన్ అనే వ్యక్తి, మైనర్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News January 16, 2026
రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్‌ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
News January 16, 2026
IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <
News January 16, 2026
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్‌ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.


