News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.
Similar News
News January 16, 2026
BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.
News January 16, 2026
కనుమ పండుగ విశిష్టత మీకు తెలుసా..?

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండగ అనికూడా అంటారు. సంవత్సరం కాలం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ కనుమ రోజు రైతులు తమ పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.