News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 24, 2026
నెల్లూరుకు రూ.15 వేల కోట్లతో భారీ పరిశ్రమలు రాక

నెల్లూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇటీవల జరిగిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 13 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా కంపెనీలు MOU కుదుర్చుకున్నాయి. దీంతో జిల్లా పారిశ్రామిక నడవాగా మారనుంది. 13 పరిశ్రమల్లో రూ.15,403 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 37,213 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వీటిల్లో ఇప్పటికే 5 నుంచి 6 పరిశ్రమలకు భూ సేకరణ సైతం పూర్తి చేయగా.. మిగిలిన వాటికి స్థల సేకరణ జరుగుతోంది.
News January 24, 2026
నెల్లూరు: అటవీ శాఖ సగానికి.. సగం ఖాళీ..!

జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, కావలి, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో 2.29 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 167 పోస్టులకు 85 ఖాళీలు ఉండగా.. వాటిల్లో DRO 10 పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. FSO 21 పోస్టులకు 7, FBO 75 పోస్టులకు 22, ABO 61 పోస్టులకు 57 ఖాళీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం పక్కదారి పట్టడానికి ఇదొక కారణమని తెలుస్తోంది.
News January 24, 2026
గణతంత్ర దినోత్సవ పేరెడ్లో.. ఉదయగిరి కోటకు చోటు

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26న నెల్లూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో జరిగే శకటాల ప్రదర్శనలో ఉదయగిరి కోటకు మొదటిసారిగా చోటు దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఉదయగిరి దుర్గానికి ఇప్పటికైనా గుర్తింపు లభించినందుకు నెల్లూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉదయగిరి వాసులు కోరుతున్నారు.


