News May 7, 2025

మలికిపురం: కరెంటు షాక్‌‌తో వ్యక్తి మృతి

image

మలికిపురం మండలం దిండిలో చెరువుల వద్ద కరెంటు షాక్‌కు గురై రామరాజులంకకు చెందిన పున్నం నాగ మావుళ్లు (32) మృత్యువాత పడ్డాడని ఎస్సై సురేష్ శుక్రవారం తెలిపారు. రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్న మావుళ్లు కరెంటు మోటార్ స్విచ్ వేస్తుండగా షాక్‌కు గురయ్యాడన్నారు. స్థానిక రైతులు అతన్ని అంబులెన్స్‌లో రాజోలు తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. మృతుని సోదరుడు బ్రహ్మయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 12, 2026

విశాఖ: సహజీవన భాగస్వామిని హత్య చేసిన మహిళ?

image

ఆనందపురం శివారున పందుల పాక వద్ద <<19110634>>నాగశివ<<>> (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలిని పరిశీలించారు. నాగశివ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యకు గురయ్యాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాగశివ ముబీనా అలియాస్ శ్రావణి (41)తో సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రావణి దాడి చేసి చంపినట్లు సమాచారం.

News February 12, 2026

US హౌస్‌లో ట్రంప్‌కు షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

image

US హౌస్ సభ్యులు ట్రంప్‌కు షాకిచ్చారు. <<18949938>>కెనడా<<>>పై విధించిన టారిఫ్స్‌ను తిరస్కరిస్తూ ఓటు వేశారు. డెమొక్రాట్లు తీసుకొచ్చిన తీర్మానం 219-211 తేడాతో నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) కూడా అనుకూలంగా ఓటేయడం గమనార్హం. అయితే దీనికి సెనేట్, ట్రంప్ ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

News February 12, 2026

తూ.గో: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

image

NDA ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.