News November 19, 2025
మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
మహా జాతరకు భారీ ఏర్పాట్లు ఇలా..!

భక్తుల అంచనా: సుమారు 3కోట్లు
సిబ్బంది: 21శాఖలు.. 42,027మంది
ఆదివాసీ వాలంటీర్లు: 2వేలు
పరిపాలనా విభజన: 8 జోన్లు.. 42 సెక్టార్లు
శాశ్వత మొబైల్ టవర్లు: 27
తాత్కాలిక టవర్లు: 33
VHF సెట్లు: 450
పార్కింగ్ స్థలాలు: 1418 ఎకరాలలో 42
టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు: 4,000
మొత్తం ట్రిప్పులు: 51,000
ఆర్టీసీ సిబ్బంది: 10,441
తాగునీటి నల్లాలు: 5,482
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119
News January 14, 2026
కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

భోగి పండుగను పురస్కరించుకొని భీమదేవరపల్లి(M) కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. తమ గండాలు, కష్టాలు తొలగిపోవాలని గండ దీపం వద్ద నూనె పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, గుమ్మడికాయ, కోరమీసాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రాంగణం అంతా ‘శరభ శరభ’ అంటూ మారుమోగింది.
News January 14, 2026
సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.


