News November 19, 2025
మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.
News January 15, 2026
‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.
News January 15, 2026
బిక్కనూర్: ‘వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది జీవన విధానం’

వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది మన జీవన విధానం అని చాటిచెప్పింది కాచాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి మహాన్వి. సంక్రాంతి పురస్కరించుకుని గురువారం ఆమె వేసిన ముగ్గు గ్రామస్తులను ఆలోచింపజేసింది. రైతు జీవన శైలిని ప్రతిబింబిస్తూ రంగురంగులతో తీర్చిదిద్దిన ఈ రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే వ్యవసాయంపై మమకారాన్ని చాటిన మహాన్విని పలువురు అభినందించారు.


