News August 20, 2025

మలికిపురం: 3 రోజులపాటు దిండి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

image

మలికిపురం మండలం దిండి- చించినాడ గోదావరి బ్రిడ్జిపై చేపట్టనున్న జాతీయ రహదారి మరమ్మతు పనుల నిమిత్తం మరో 3 రోజులపాటు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీలలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు రాకపోకలను నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఈ రహదారి వెంబడి ప్రయాణాలు సాగించే వాహనదారులందరూ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News January 22, 2026

ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి: కలెక్టర్

image

ప్రజలకు అందించే సేవలు నాణ్యతను పెంచేందుకు ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవల్లో పారదర్శకత పెంచాలన్నారు. ప్రజల సంతృప్త స్థాయిలను మెరుగుపరచాలన్నారు.

News January 22, 2026

5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

image

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.

News January 22, 2026

బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.