News April 2, 2024
మలుపులు తిరుగుతున్న వరంగల్ పార్లమెంట్ స్థానం!

వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానం రోజుకో మలుపు తిరుగుతోంది. BRS సిట్టింగ్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వకుండా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. తీరా కావ్య సైతం ఇటీవల BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో BRS మరో అభ్యర్థిని అన్వేశించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, BJP టికెట్ ఆరూరి రమేశ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే.
Similar News
News February 18, 2026
రైతుల సాగు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

రైతుల పంటల సాగును ఏఈఓలు సందర్శించి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనురాధతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులతో ఫార్మర్ రిజస్టరీ, క్రాప్ బుకింగ్, యూరియా నిల్వలు, రైతుబీమాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈఓలు వారి పరిధిలోని గ్రామాలలో రైతుల రిజిస్టర్‌కు సంబంధించి ఐడి క్రియేట్ చేయాలన్నారు.
News February 18, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: WGL కలెక్టర్

ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 12,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతుల్లో లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.
News February 17, 2026
రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో నక్షలు లేని గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. నక్షలు లేని గ్రామాల్లో భూసర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేసి, భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.


