News March 26, 2024

మల్కాజిగిరిపై సీఎం SPECIAL ఫోకస్

image

మల్కాజిగిరి సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. సునీతారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. కాగా BRS నుంచి రాగిడి, BJP నుంచి ఈటల పోటీ చేస్తున్నారు.

Similar News

News February 18, 2026

హైదరాబాద్‌లో మళ్లీ 2BHK ఇండ్లు

image

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

News February 18, 2026

HYD: బాంధవ్య విలువలకు నిదర్శనం

image

రక్త సంబంధం, అనుబంధం కాలాలు, ఖండాలు దాటించాయి. ప్రాంతాలేవైనా అవి ఎంత బలంగా ఉంటాయో ఈ ఘటనే నిరూపిస్తోంది. బ్రిటన్‌కు చెందిన రాబిన్ డిక్సన్, తన ముత్తాత లెఫ్టినెంట్ చార్లెస్ విల్సన్ సమాధి కోసం దాదాపు 19ఏళ్ల పాటు వివిధ దేశాల్లో వెతికారు. చివరికి SEC తిరుమలగిరి సెమెట్రీ-12లో ఆ సమాధిని కనుగొన్నారు. ఏళ్లు గడిచినా, వేల మైళ్ల దూరం ఉన్నా వెతుక్కుంటూ రావడం ఆ కుటుంబానికి పూర్వీకులపై ఉన్న గౌరవానికి నిదర్శనం.

News February 18, 2026

HYD: రేపటి నుంచి నైట్ అంతా ఓపెన్!

image

తెలంగాణలో రంజాన్ సందర్భంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మినహాయింపులు అమలులో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం 5 గంటల వరకు(నైట్ బజార్) షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇక చార్మినార్‌లో రేపటి నుంచి నైట్ బజార్‌ మొదలుకానుంది. ఇక 24/7 నగరవాసుల రాకపోకలతో పాతబస్తీ కళకళలాడనుంది.