News February 14, 2025

మల్కాపురం ఘటనలో ఆటో డ్రైవర్ మృతి

image

మల్కాపురంలోని ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన వివాదంలో కత్తిపోట్లకు గురైన శామ్యూల్ KGHలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్కాపురం ఆటో స్టాండ్ వద్ద అప్పలరెడ్డికి శామ్యూల్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో అప్పలరెడ్డి తన వద్ద ఉన్న <<15456247>>కత్తితో శామ్యూల్‌ని <<>>పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. KGHలో చేర్పించి ఆపరేషన్ చేసినప్పటికీ శామ్యూల్ మృతి చెందాడు. కాగా..నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 19, 2025

గాజువాక ఐటీఐలో నేడు జాబ్ మేళా 

image

గాజువాక ఐ.టి.ఐలో నేడు జాబ్ మేళా జరగనుంది. అప్రెంటీస్‌తో పాటు నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో రావాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పదవతరగతి, ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పాటు 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ, ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అయన తెలిపారు.

News March 19, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయితో ఐదుగురు అరెస్ట్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ ధనంజయనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ఐదుగురు నుంచి రూ.1,17,000 విలువ గల 23.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచారు. నిందితులను పట్టుకున్న సబ్-ఇన్స్పెక్టర్లు రామారావు,కీర్తి రెడ్డి,అబ్దుల్ మారూఫ్,శాంతరాం, సిబ్బందిని రైల్వే పోలీస్ డీసీపీ రామచంద్ర రావు అభినందించారు.

News March 18, 2025

డబుల్ హెల్మెట్ ఎఫెక్ట్.. విశాఖలో 39 బైకులు స్వాధీనం 

image

బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరని విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆర్.సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎన్ఏడీ, మద్దిలపాలెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యాక వాహనం నడిపితే వాహనం స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.

error: Content is protected !!