News March 13, 2025

మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

image

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.

Similar News

News February 16, 2026

రేపు స్కూళ్లలో ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని అధికారులు పేర్కొన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: కట్టుదిట్టమైన పార్కింగ్.. ఇబ్బందులకు చెక్!

image

ఏడుపాయల వనజాతరకు వచ్చే భక్తుల కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టేకులగడ్డ, చెలిమెకుంట వద్ద భారీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. బారికేడ్ల సాయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. సోమవారం జరిగిన బండ్ల ఊరేగింపు, మంగళవారం జరగనున్న రథోత్సవానికి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

BREAKING: కాంగ్రెస్‌లోకి ADB మున్సిపల్ ఛైర్‌పర్సన్

image

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.