News August 12, 2025
మల్యాల: గీత కార్మికుడి సూసైడ్

మల్యాల మండలం గొర్రెగుండంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంగు అంజన్న గౌడ్ తాటిచెట్టుపై ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News March 15, 2026
శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ కోసం క్యూ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెట్రోలు కోసం బoకుల వద్ద జనం క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఊహాగానాలు జోరందుకోవడంతో ప్రజలు పెట్రోలు బంకులకు పరిగెడుతున్నారు. ఈ ఊహాగానలలో నిజం లేదని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, రూమర్స్ నమ్మొద్దని సూచిస్తున్నా… పానిక్ బైయింగ్స్ కొనసాగుతున్నాయి
News March 15, 2026
చిత్తూరు: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ మెసేజ్‌లను నమ్మొద్దని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బిల్లు బకాయి ఉందని, కట్ట కుంటే సరఫరాను ఆపివేయనున్నట్లు, మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ కొందరు వినియోగదారులకు సందేశాలు అందుతున్నట్లు తెలిసిందన్నారు. ఎటువంటి వివరాలైన APSPDCL అధికారిక వర్గాల ద్వారా తెలియజేస్తామన్నారు.
News March 15, 2026
గల్ఫ్ దేశాలపై దాడులు చేయొద్దు.. ఇరాన్‌ను కోరిన హమాస్!

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. US, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.


