News January 24, 2025

మల్యాల: విషాదం.. సాయి సూసైడ్ బాధాకరం

image

జగిత్యాల(D) మల్యాల(M) కేంద్రానికి చెందిన భోగ సాయి (25) <<15237218>>దుబాయ్ లో<<>> సూసైడ్ చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 5 ఏళ్ల క్రితం తండ్రి గంగాధర్ చనిపోయాడు. తర్వాత దుబాయ్ వెళ్లిన సాయి ఏడాది క్రితం వివాహం కోసం స్వగ్రామం వచ్చాడు. ఆ సమయంలో తల్లి శారద అనారోగ్యంతో చనిపోయింది. ఇక పెళ్లి చేసుకోకుండా ఇటీవల సాయి మళ్లీ దుబాయ్ వెళ్లాడు. సాయికి ఇద్దరు సిస్టర్స్ ఉండగా, వారికి పెళ్లిళ్లు అయినట్లు తెలిసింది.

Similar News

News February 13, 2025

పోలవరం: నేత్రాదానం చేసిన మహిళ

image

పోలవరం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి అనిత (36) గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుటుంబ సభ్యులు ఆమె మరణానంతరం రాజమండ్రి శ్రీ రాధాకృష్ణ ‘ఐ’ బ్యాంకుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టెక్నీషన్‌లు కొత్తపేటకు చేరుకుని, మృతురాలు కంటి కార్నియాలను సేకరించారు. తాను చనిపోతూ మరొకరికి చూపునిచ్చేలా చేయడం పునర్జన్మతో సమానమని కుటుంబ సభ్యులు భాగోద్వాగానికి లోనైయ్యారు. ఆమెను పలువురు ప్రసంశించారు.

News February 13, 2025

నెల్లూరు: రోళ్లపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

V.V.పాలెం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. 167B హైవే సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి బైకును ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మయ్య(60)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 13, 2025

పులివెందుల: గడ్డి మందు తాగి బాలుడు మృతి

image

పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెకు చెందిన వెంగముని, దేవిల కుమారుడు మోహిత్(14) మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. బంధువులు మోహిత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేశారు. బుధవారం చికిత్స పొందుతూ మోహిత్ మృతి చెందాడని బంధువులు తెలిపారు. కాగా ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే బాలుడు విషం తాగాడని సమాచారం.

error: Content is protected !!