News November 30, 2025

మల్లన్న పేరు మీదనే సాగర్ నిర్మాణం: హరీశ్ రావు

image

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామి పేరు మీదనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిర్గాపూర్‌లో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే మల్లన్న సాగర్ నీరు ఖేడ్ ప్రాంతానికి సరఫరా అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు.

Similar News

News February 13, 2026

ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు

image

తిరుపతి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో భద్రత, సౌకర్యాలు, కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ.గోవిందరావు, డీఐఈఓ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News February 13, 2026

అనకాపల్లి: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

చోడవరం(M) లక్కవరం గ్రామానికి చెందిన బొడ్డు సురేంద్ర(24) అనే యువకుడు గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని SI నాగకార్తీక్ శుక్రవారం తెలిపారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని పోలీసులు తెలిపారు. సురేంద్రకు ఏడాది క్రితమే వివాహం కాగా.. ప్రస్తుతం అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి.

News February 13, 2026

ADB: KU డిగ్రీ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 1,3,5వ సెమిస్టర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ని నమోదు చేసి ఫలితాలు చూడవచ్చు. రీ వాల్యుయేషన్‌కి ఈ నెల 28 చివరి తేదీ అని ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ తెలిపారు. ఫలితాల కోసం https://www.kuonline.co.in/Result/RS_NOV2025.aspx వెబ్ సైట్‌ను సందర్శించండి.