News August 14, 2025

మహదేవపూర్: విద్యార్థులకు తప్పిన ప్రమాదం

image

మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు విద్యార్థులతో పాటు అటెండర్‌కు షాక్ తగిలింది. పాఠశాల పైనుంచి జెండాను కిందకు తీస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆరు, ఏడు, ఎనిమిదవ తరగతి చదువుతున్న అబ్బాయిలు ఈ ప్రమాదానికి గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2026

చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

image

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్‌కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

News March 15, 2026

నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

image

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.