News March 10, 2025
మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News January 13, 2026
JGL: ఎమ్మెల్యే గారు ఏ పార్టీ బీ–ఫామ్ ఇవ్వబోతున్నారు?

ఎమ్మెల్యే గారు ఏ పార్టీ బీ–ఫామ్ ఇవ్వబోతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి ప్రశ్నించారు. జగిత్యాలలో మంగళవారం ఆమె మాట్లాడుతూ,, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారని JGl ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందన్నారు.
News January 13, 2026
చిట్యాల: సందడి చేసిన హరిదాసు..!

చిట్యాలలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు సందడి చేశారు. మహిళలు, చిన్నారులు హరిదాసుతో ఫొటోలు దిగి సంబరపడ్డారు. కాషాయ వస్త్రధారణలో కాళ్లకు గజ్జలు, మెడలో పూలదండ, తలపై అక్షయపాత్ర పెట్టుకొని సంకీర్తన చేశారు. హరిదాసు తన వీణకు స్కానర్ పెట్టుకొని అప్‌డేట్ అయ్యారు. ఆలయ కమిటీ వారు గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, హరిదాసు సంకీర్తనతో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు.
News January 13, 2026
KNR: నామినేటేడ్ పదవులపై ఆశలు గల్లంతు.. స్థానిక ఎన్నికల ఎఫెక్ట్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు అయినప్పటికీ నేటికి జిల్లాల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పార్టీ క్యాడర్లో నిరాశ నెలకొంది. పార్టీ పదవులే కాకుండా, మార్కెట్ కమిటీ, గ్రంథాలయాల వంటివి కూడా చాలాచోట్ల పెండింగ్ లోనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లో 39 AMCలు ఉండగా, చాలాచోట్ల నాయకుల వర్గపోరుతో పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికలతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండగ, ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి.


