News March 8, 2025
మహబూబాబాద్: చేపలు పట్టిన కేసులో ఎనిమిది మందికి రిమాండ్: SI

నెల్లికుదురు మండలం ఆకేరు వాగులో కరెంటుతో చేపలు పట్టిన కేసులో 8 మందిని శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ చిర్ర రమేశ్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఘటనలో పడమటి గడ్డ తండాకు చెందిన జాటోతు రెడ్యా వాగులో ఉండగా కరెంట్ సప్లై జరిగి మృతిచెందాడు. సంబంధిత కేసులో అదే తండాకు చెందిన 8 గురుని CI గణేశ్ రిమాండ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.
Similar News
News March 20, 2025
NLG: 105 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, 6 లైన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేశారు
News March 20, 2025
భువనగిరి: 50 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

జిల్లాలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 50 పరీక్ష కేంద్రాలలో 8,362 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుందని, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News March 20, 2025
ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.