News January 30, 2025
మహబూబాబాద్: ‘వారిని ప్రేమతో ఆదరించాలి’

మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్ష్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఇందులో భాగంగా సమాజంలోని లెప్రసీ రోగులను ప్రేమతో ఆదరించాలని కోరారు.
Similar News
News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
News February 14, 2025
HYD: ఎండాకాలం.. సోడా బండి కష్టాలు..!

ఎండాకాలం సోడా బండి కష్టాలు వర్ణనాతీతం. ఓవైపు భగభగ మండే ఎండ, ఇంకోవైపు పూట గడవాలంటే కష్టపడక తప్పని పరిస్థితి. రోడ్డుపై సోడా బండి లాగుతూ ఓ వ్యక్తి పడుతున్న కష్టాన్ని ఓ ఫొటోగ్రాఫర్ బాలానగర్ ప్రాంతంలో క్లిక్ చేశాడు. కుటుంబ బండిని ముందుకు నడిపించేందుకు సోడాబండిపై ఎంతో దూరం నుంచి HYD వస్తుంటారని తెలిపారు. చెమటోడ్చి కష్టపడుతూ.. సోడాతో దాహార్తి తీర్చే వారికి ఈ ఆర్టికల్ అంకితం.
News February 14, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.