News April 30, 2024
మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో 31 మంది అభ్యర్థులు

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి 35 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీలో 35 మంది నామినేషన్లు ఆమోదించారు. వారిలో సోమవారం నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ ఉండనుంది.
Similar News
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 15, 2026
MBNR : దడ పుట్టిస్తున్న ఎండలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 42.2, మహమ్మదాబాద్ 42.0, దేవరకద్ర 41.9, గండీడ్ మండలం సల్కర్ పేట, అడ్డాకుల 41.8, మిడ్జిల్ మండలం దోనూరు, హన్వాడ 41.4, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 41.3, జడ్చర్ల, కౌకుంట్ల 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


