News November 19, 2025
మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News January 20, 2026
పెద్దపల్లి: రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కల్పన తెలిపారు. 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆయా జూనియర్ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
News January 20, 2026
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: హనుమకొండ కలెక్టర్

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు హసన్‌పర్తి ఈటీసీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. సర్పంచులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొంటూ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
News January 20, 2026
సిరిసిల్ల: ‘వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయి’

బీజేపీలో పదవులు వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున బీజేపీ కార్యాలయంపై మంగళవారం జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. సేవ చేసే వారికి మాత్రమే పట్టం కట్టే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. శంకర్, తిరుపతి, రాజు, హరీష తదితరులు పాల్గొన్నారు.


