News May 13, 2024
మహబూబ్‌నగర్: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నేడు ఓటేసేందుకు రావాలని MBNR,NGKL,నారాయణపేట,గద్వా, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని, యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.
Similar News
News December 11, 2025
MBNR: ఫలితాల అనంతరం ర్యాలీలపై నిషేధం: ఎస్పీ డి జానకి

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, బాణసంచాలు, గుంపులుగా గుమిగూడడం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News December 11, 2025
MBNR: మల్లేపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు లింగం గెలుపు

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ తొలి ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లింగం 364 ఓట్ల మెజారిటీతో మరో అభ్యర్థి కావలి భాస్కర్‌పై గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు లింగంకు అభినందనలు తెలిపారు.
News December 11, 2025
MBNR: 11 గంటల వరకు 56.63%.. మరికొద్ది నిమిషాలే టైం..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల సందర్భంగా ఉదయం 11 గంటల సమయానికి 56.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరికొద్ది సేపు మాత్రమే ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


