News December 2, 2025
మహబూబ్‌నగర్: జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల నుంచి జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
Similar News
News February 17, 2026
జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 17, 2026
పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT
News February 17, 2026
MBNR: మేయర్, డిప్యూటీ మేయర్ వేతనాలు ఎంతో తెలుసా..!

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ముగిశాయి. ఎంతోమంది ఎన్నో ఎన్నో లక్షల ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీపడి కార్పొరేటర్‌గా గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా గట్టి పోటీ ఉంటుంది. మేయర్ నెలసరి వేతనం రూ.65 వేలు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేయర్‌కు రూ.32,500, అలాగే కార్పొరేటర్‌కు రూ.7,800 వేతనాలు ఉంటాయి.


