News November 8, 2025

మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

మహబూబ్ నగర్ నియోజకవర్గం మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. MBNR ఫస్ట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ శనివారం తెలిపారు.18 నుంచి 50 వయసు ఉండాలని 72079 88913, 72079 88914 సంప్రదించాలన్నారు.

Similar News

News January 17, 2026

పాలమూరు తొలి మేయర్‌గా బీసీ మహిళ

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఖరారు అయింది. రిజర్వేషన్లలో మేయర్ స్థానాన్ని బీసీ మహిళగా ఖరారు చేస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయిన తర్వాత తొలి మేయర్‌గా బీసీ మహిళ అందాల ఎక్కబోతుంది. కాగా పాలమూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో బీసీ సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

పాలమూరు:ఉచిత శిక్షణ.. రేపే లాస్ట్!

image

ఉమ్మడి MBNR జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI,RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ & సర్వీసింగ్ కోర్సులలో ఈనెల 19 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని, 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 18లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.

News January 16, 2026

MBNR: రేపు సీఎం రాక.. భారీ బందోబస్తు

image

మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ-1, అడిషనల్ ఎస్పీలు-7, డీఎస్పీలు-10, సీఐలు-34, ఎస్సైలు-77, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు-182, పీసీలు/వుమెన్ పీసీలు-741, హోంగార్డులు-110, వుమెన్ పీసీలు/వుమెన్ హోంగార్డులు-22, మొత్తం 1,184 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో హాజరుకానున్నారు.