News May 13, 2024

మహబూబ్ నగర్: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. – SHARE IT

Similar News

News December 13, 2025

పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

సిరి వెంకటాపూర్‌లో అత్యంత ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి, దోనూరు, కోయిలకొండ మండలం పారుపల్లి 10.6, మిడ్జిల్ 10.9, మహబూబ్‌నగర్ గ్రామీణం 11.0, దేవరకద్ర, రాజాపూర్ 11.1, మహమ్మదాబాద్, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.