News February 17, 2025

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆనం ఆవిష్కరణ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆత్మకూరు పట్టణ సమీపంలోని తిరునాళ్ల తిప్ప వద్ద శ్రీ కాశినాయన ఆశ్రమంలో ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రావాలని ఆలయ కార్యనిర్వాహకులు కోరారు.

Similar News

News April 10, 2026

నెల్లూరు: 12న మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్

image

నెల్లూరు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలన్నారు. www.apms. apcfss.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 10, 2026

నెల్లూరు జిల్లాలో 30 ఏళ్లుగా ఎదురుచూపులు!

image

రాపూరు(M) కండలేరు జలాశయం నిర్మాణానికి భూములు ఇచ్చిన 19 గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఎకరాల భూములతో పాటు విలువైన పండ్ల తోటలను కోల్పోయారు. ఇందులో కొంతమందికే ఇళ్లు కేటాయించారు. 117 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చినప్పటికీ మరో 60 కుటుంబాలకు ఇప్పటికీ కాలనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 10, 2026

నెల్లూరులో సిటీ బస్సులు.. ఛార్జీలు ఇవే!

image

నెల్లూరులో శనివారం నుంచి <<19607446>>సిటీ సర్వీసులు <<>>ప్రారంభం కానున్నాయి. బస్సులు తిరిగే రూట్లు, ధరలు ఇలా..
RTC- అయ్యప్ప గుడి(రూ.10)
RTC-కొత్తూరు(రూ.20)
RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు(రూ.20)
RTC-ములుమూడి బస్టాండ్(రూ.10)
నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్(రూ.10)
నారాయణ హాస్పిటల్-VRC సెంటర్(రూ.20)