News February 26, 2025

మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు స్వామి వారి కళ్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరగనున్నాయి. రోజంతా నిత్య పూజలతో పాటు, జాగరణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు ఏర్పాటు చేశారు.

Similar News

News March 7, 2026

WGL: రంజాన్.. మసీదులకు లైటింగ్ ఏర్పాటు

image

రంజాన్ పర్వదినం సందర్భంగా మసీదులకు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం GWMC సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ పాల్గొని ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా బల్దియా ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్లలో దెబ్బతిన్న లైట్లను పునరుద్ధరించడంతో పాటు ఎన్పీడీసీఎల్ వారి సమన్వయంతో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు.

News March 7, 2026

31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం: పొంగులేటి

image

ఖమ్మం: ఈనెల 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇళ్లు వెంటనే గ్రౌండింగ్ కావాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఈలోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

News March 7, 2026

మహబూబాబాద్: పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కామన్ డైట్ మెనూను అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, ర్యాగింగ్ జరగకుండా చూడాలన్నారు.