News March 4, 2025

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

image

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

చిత్తూరు పోలీసులకు 46 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 46 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 8, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 7 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News December 9, 2025

నిజామాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, సాలూర, నవీపేట్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లోని 184 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

నిర్మల్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ, లక్ష్మణచందా మండలాల్లోని 136 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.