News March 8, 2025

మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజ పురోగతి: కేసీఆర్

image

మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజ పురోగతి ఉంటుందని మాజీ సీఎం కెసిఆర్ శనివారం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు ఈ సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత సాధ్యమైనప్పుడే దేశాభివృద్ధి పూర్తిగా సాకారమవుతుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Similar News

News January 14, 2026

కొత్తకొండలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కిక్కిరిసిన భక్తులు

image

భోగి పండుగను పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. తమ గండాలు, కష్టాలు తొలగిపోవాలని గండ దీపం వద్ద నూనె పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, గుమ్మడికాయ కోరమీసాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

News January 14, 2026

పీవీ ఇంటి నుంచి బయల్దేరిన వీరభద్రస్వామి రథోత్సవం

image

ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి రథోత్సవం వంగర నుంచి కొత్తకొండ వరకు వైభవంగా జరగనుంది. ఈ రథోత్సవం శివసత్తుల పూనకాలు, యాదవ డోలు, డప్పుళ్లు, మహిళల కోలాటాలతో భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవ వాతావరణంలో సాగనుంది. 1926 నుంచి మాజీ ప్రధాని పీవీ వంశస్థులు ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.

News January 14, 2026

కామారెడ్డి: భోగి సంబరం.. ముంగిళ్లలో విరిసిన రంగవల్లులు!

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ తొలిరోజైన ‘భోగి’ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే మహిళలు తమ వాకిళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. పండుగను పురస్కరించుకుని పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువతులు పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసిన నిర్వాహకులు, విజేతలకు బహుమతులను అందజేశారు.