News November 8, 2025

మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

image

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్‌ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్‌ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.

Similar News

News January 17, 2026

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

News January 17, 2026

మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

image

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.

News January 17, 2026

గ్రీన్‌లాండ్‌ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్‌లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.