News September 12, 2025

మహిళల రక్షణ కోసమే షి టీం: ఏఎస్సై సునీత

image

మహిళల రక్షణకే షీ టీం పనిచేస్తుందని షీ టీం ఇన్చార్జి ఏఎస్సై సునీత అన్నారు. శుక్రవారం బెజ్జూర్ కస్తూర్బా గాంధీ, ZPSS విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. మహిళలకు, బాలికలకు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే డయల్ 100 లేక షీ టీం నెంబర్ 8712670565కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

image

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.

News December 13, 2025

కాకినాడ: మద్యం మత్తులో హత్య

image

కాకినాడలోని సంతచెరువు వద్ద ఈ నెల 9న జరిగిన కీర్తి సత్యనారాయణ(45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణే ఈ ఘాతుకానికి కారణమని త్రీటౌన్ సీఐ వెల్లడించారు. ఎస్డీపీఓ మనీశ్ దేవరాజ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలించి, పరారీలో ఉన్న నిందితుడు అత్తిలి రంగాను గురువారం అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News December 13, 2025

WGL: రెండో విడతలో 56 జీపీలు ఏకగ్రీవం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. హనుమకొండలో 73 జీపీలకు 5, 694 వార్డులకు 120, వరంగల్ 117కు 5, 1,008 వార్డులకు 97, జనగామలో 79కి 6, 710 వార్డులకు 155, మహబూబాబాద్‌లో 158కి 15, 1369 వార్డులకు 251, భూపాలపల్లిలో 85కి 10, 694 వార్డులకు 147, ములుగులో 52కి 15 జీపీలు, 1,686 వార్డులకు 147 మొత్తం 564 జీపీలకు 56, 4,937 వార్డులకు 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.