News September 11, 2025
మహిళా యూనివర్సిటీ విద్యార్థినికి అరుదైన అవకాశం

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ B.Tech విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. చివరి సంవత్సరం CSE చదువుతున్న చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఆమెకు ఈ అవకాశం లభించింది. ఈ మేరకు ఆమెను VC ఉమ, రిజిస్ట్రార్ రజిని అభినందించారు.
Similar News
News December 15, 2025
పిట్లం: నాడు తండ్రి ఉప సర్పంచ్.. నేడు కొడుకు సర్పంచ్

పిట్లం జీపీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శేఖర్ విజయం సాధించారు. ఈయన తండ్రి దివంగత సాయిలు గతంలో ఇదే పిట్లం జీపీకి ఉప సర్పంచ్ గా పనిచేశారు. తండ్రి ఉప సర్పంచ్‌గా పనిచేసిన జీపీకి కొడుకు సర్పంచ్‌గా ఎన్నిక కావడంపై స్థానికంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ శేఖర్ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ పరిణామం పిట్లం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News December 15, 2025
ఏలూరు SP ‘స్పందన’లో 38 ఫిర్యాదులు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఎక్కవ ఫిర్యాదులు అందినవని తెలిపారు.
News December 15, 2025
జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.


