News March 6, 2025
మహిళా సాధికరతకు అడుగులు: పార్వతీపురం SP

మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని SP ఎస్. వి మాధవ్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా స్థానిక MT కార్యాలయంలో పోలీసు ఆయుధాలపై మహిళలకు ఓపెన్ హౌస్ కార్యక్రమని గురువారం నిర్వహించారు. సమాజంలో మహిళలు ఆపదవస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి ఆపద వచ్చిన ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
Similar News
News December 12, 2025
GNT: రేపు నవోదయలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష

దేశవ్యాప్తంగా నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా మద్దిరాలలో ఉన్న నవోదయ విద్యాలయ ప్రవేశానికి 5,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 12 బ్లాకులలోని 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడ్మిట్ కార్డు పొందటంలో ఇబ్బందులున్నచో నవోదయ విద్యాలయ మద్దిరాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News December 12, 2025
భూపాలపల్లి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో హస్తం దే హవా!

జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగిన రేగొండ, గణపురం, మొగుళ్లపళ్లి, కొత్తపల్లి గోరి మండలాల్లో మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 82 సర్పంచ్ స్థానాలు, 712 వార్డులు ఉన్నాయి. 9 సర్పంచులు, 160 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 73 పంచాయితీలు, 552 వార్డులకు 11న ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 57 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 4 బీజేపీ పార్టీల మద్దతుదారులు గెలిచారు.
News December 12, 2025
గుంటూరు: వైసీపీ మీడియా ప్యానలిస్టులు వీరే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నూతన మీడియా ప్యానలిస్టులను నియమించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈ జాబితాలో అవకాశం దక్కింది. ఆవుతు శ్రీధర్, షేక్ మహబూబ్ షరీఫ్‌ను హిందీ ఛానెల్స్ ప్యానలిస్ట్‌గా నియమించారు. వీరు పార్టీ తరఫున మీడియాలో వాణి వినిపించనున్నారు.


