News September 10, 2025
మాచర్లలో యువకుడి అనుమానాస్పద మృతి

మాచర్లలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం రహదారిలో గల గ్యాస్ గోదాము పక్కన ఉన్న తారు ప్లాంటు వద్ద యువకుడి తలకు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.హత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.


