News October 8, 2025

మాచర్ల: పిన్నెల్లి బ్రదర్స్ విచారణ వాయిదా

image

వైసీపీ నేతలు పిన్నెల్లి బ్రదర్స్ మధ్యంతర బెయిల్ విచారణ సుప్రీం కోర్టులో బుధవారం జరగనున్న నేపథ్యంలో పోలీసులు నేటి కేసు విచారణను వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ అనంతరం పిన్నెల్లి బ్రదర్స్‌ని విచారణకు పిలవాలని మాచర్ల రూరల్ పోలీసులు నిర్ణయించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల సంఘటనలో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 13, 2026

మెదక్: సంరక్షణ కిట్లు అందజేయడం హర్షణీయం: కలెక్టర్

image

రైతులు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు సంరక్షణ కిట్లు అందజేయడం జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పూల బొకేలుకు బదులు సంరక్షణ కిట్లు అందజేయాలన్న కలెక్టర్ పిలుపుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

News January 13, 2026

తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్‌గా నల్గొండ బిడ్డ ఎంపిక

image

రాజస్థాన్ ఉదయపూర్‌లో జరుగుతున్న జాతీయ హాకీ పోటీల్లో నల్గొండకు చెందిన కుంచం రాకేశ్ తెలంగాణ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని ఉమ్మడి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమాం కరీం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి SGF U/19 హాకీ పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కెప్టెన్‌గా ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News January 13, 2026

కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

image

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.