News January 20, 2026

మాచారెడ్డి: విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టుకు ఎస్పీ ఫిదా!

image

మాచారెడ్డి (M) మర్రితండా వాసి అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Similar News

News February 15, 2026

కడప: ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర

image

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.

News February 15, 2026

విశాఖ తీరంలో జపాన్ నావికుడిని రక్షించిన భారత నౌకాదళం

image

సముద్రంలో తీవ్ర అనారోగ్యానికి గురైన జపాన్ నావికుడిని భారత నౌకాదళం శనివారం సాహసోపేతంగా రక్షించింది. తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ నౌక నుంచి ‘సీ‌ కింగ్’ హెలికాప్టర్ ద్వారా బాధితుడిని ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని నావల్ ఆస్పత్రి కళ్యాణికి తరలించారు. ఈ ఆపరేషన్ భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న పటిష్ఠమైన అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని మరోసారి చాటిచెప్పింది.

News February 15, 2026

ప.గో: పంచ శైవక్షేత్రం పట్టిసీమ ముస్తాబు

image

పంచ శైవ క్షేత్రాలలో ఒకటైన పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వసిద్ధమైంది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులను గోదావరి నది దాటించేందుకు సురక్షితమైన పంటు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం నుంచే భక్తుల తాకిడి ప్రారంభం కావడంతో, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేశారు.