News August 2, 2024

మాజీ సీఎంతో ఉమ్మడి విశాఖ నేతలు భేటి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మిలతో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు.

Similar News

News December 11, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్‌ అండ్‌ రన్ కేసులో మరణించిన పెద్దింటి లక్ష్మీనారాయణ భార్య పెద్దింటి రంగమ్మకు రూ.2 లక్షలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 101 మంది బాధితులకు మొత్తం రూ.82లక్షలు అందించినట్లు చెప్పారు.

News December 11, 2025

విశాఖలో రూ.307 కోట్లతో రోడ్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

image

విశాఖలో రూ.306.95 కోట్లతో 88.35 కి.మీ. మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జోన్-2లోని కార్ షెడ్ -పీఎం పాలెం రోడ్డును పరిశీలించి కార్యాచరణ ప్రారంభించారు. రోడ్లను ఆధునిక వసతులు, పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

News December 11, 2025

జీవీఎంసీలో గ్రామాల విలీనం సరికాదు: బొలిశెట్టి సత్యనారాయణ

image

గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయడం సరైంది కాదని జనసేన నాయకుడు బోలిశేట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కుఅని, ప్రజల అభిప్రాయం లేకుండా గ్రామాలను కార్పొరేషన్‌లో కలపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజల భవిష్యత్తు కొంతమంది రాజకీయనాయకుల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం కుదరదన్నారు.