News April 21, 2024

మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులు, ప్రజలతో మాట్లాడుతారని, రోడ్ షో కూడా నిర్వహిస్తారని వెల్లడించారు. త్వరలోనే పర్యటన వివరాలు ప్రకటిస్తామన్నారు.

Similar News

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.

News December 12, 2025

MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.