News April 27, 2024
మాజీ MLA ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ

చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు విషయం సందిగ్ధంగా మారింది. ఆమంచికి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు, క్రిస్టల్ సీఫుడ్స్ ఫ్యాక్టరీకి విద్యుత్ బకాయిలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్వో సూర్యనారాయణరెడ్డి ఆమంచి నామినేషన్ పెండింగ్లో ఉంచారు. శనివారం ఉదయం 10లోపు వాటిని సబ్మిట్ చేయాలని సూచించారు. దీంతో ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 16, 2026
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

కలెక్టర్ పి. రాజాబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. విద్యా ప్రమాణాల పెంపునకు FLN బలోపేతం చేయాలని, PAL ల్యాబ్ ట్యాబ్స్ వినియోగం, క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు పోషకాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు అందించాలని ఆదేశించారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.


